దేశంలో గత రెండు నెలలుగా పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, పెట్రోల్ ధరల పెరుగుదలపై మధ్యప్రదేశ్ మంత్రి ఓమ్ ప్రకాశ్ శక్లేచా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: “తగ్గేదే లే” అంటున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !
ఇబ్బందులు పడినపుడే మంచిరోజులు వచ్చినపుడు ఆనందాన్ని అనుభవించవచ్చని, ఇబ్బందులు లేకుంటే సంతోషాన్ని అనుభవించలేరని అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై అభిప్రాయం ఎంటని అడగ్గా ఆయన పై విధంగా స్పందించారు. పెరుగుతున్న ధరలతో ప్రజల నడ్డి విరుగుతుంటే, ఇబ్బందులు వచ్చినపుడే ఆనందం విలువ తెలుస్తుందని ఎలా అంటారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
