“తగ్గేదే లే” అంటున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దిషా పటాని ఎప్పటికప్పుడు తన హాటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపుకు మళ్లించుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోమారు బికినీ పిక్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది దిశా. టైగర్-ప్రింట్ బికినీలో బీచ్ వద్ద ఇసుకలో పడుకుని ఉన్న దిశా లుక్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. దిశా షేర్ చేసిన ఈ త్రో బ్యాక్ పిక్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆమె ఈ పిక్ ను పోస్ట్ చేసిన కాసేపట్లోనే లక్షలాది లైకులు, షేర్లతో ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి బికినీ పిక్ తో ఈ బార్బీ గర్ల్ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.

Read Also : అందాలతో అట్రాక్ట్ చేస్తున్న అలయ… పిక్స్

దిశా చివరిసారిగా “రాధే” చిత్రంలో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. ఇది థియేటర్లలో, ఓటిటిలో ఏకకాలంలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె ఏక్ విలన్ రిటర్న్స్, కెటినా సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ హాట్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో “లోఫర్” చిత్రంలో జతకట్టింది. పూరీ జగన్నాథ్ ఈ చిత్రంతో ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మరోసారి టాలీవుడ్ లో కన్పించలేదు దిశా పటాని. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-