ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ అయిన హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు..యంగ్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి ఓ చుట్టేసిన ఈ భామ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటపెడుతుంది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో హాట్ లుక్ లో కవ్విస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకుంది. `ఉప్పెన` విజయం ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. కరోనా అనంతరం ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన చిత్రం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. అంతా కొత్తవాళ్లు కలిసి సంచలనం సృష్టించారు.. కృతి శెట్టి బోర్న్ విత్ స్టార్ అన్నట్టుగా, ఆమె స్టార్‌గానే పుట్టింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే హిట్ కావడం, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ దాన్ని నిలుపుకోవడంలో, దాన్ని మెయింటేన్ చేయడంలో తడబడింది. సడెన్‌గా వచ్చిన క్రేజ్, ఇమేజ్, పాపులారిటీతో రాంగ్ నిర్ణయాలు తీసుకుంది. సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోలేకపోయింది..
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరు అవకాశాలు రావడమే గొప్ప అనే ఫీలింగ్‌లో ఉంటారు. యంగ్ స్టార్స్ తో అంటే మరో మాట లేకుండా ఓకే చెబుతుంటారు. కృతి శెట్టి అదే చేసింది. దీంతో అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. నానితో చేసిన `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` మూవీస్ ఫర్వాలేదు. కానీ రామ్‌తో చేసిన `ది వారియర్స్`, నితిన్‌తో చేసిన `మాచెర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబుతో కలిసి నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, చైతూతో మరోసారి నటించిన `కస్టడీ` చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లుగా మిగిలాయి..
అయితే ఇప్పటి వరకు కాస్త హోమ్లీ బ్యూటీగానే మెరిసిన కృతి శెట్టి ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచుతుంది. హాట్‌గా పోజులిస్తూ షాకిస్తుంది. అందాల విందులో అలరిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అదే సమయంలో మేకర్స్ హింట్ ఇస్తుంది. కమర్షియల్ హీరోయిన్‌గా, కమర్షియల్ చిత్రాలు చేసేందుకు తాను సిద్ధమే అనే సాంకేతాలను పంపిస్తుంది.. తాజాగా బ్లాక్ టీషర్ట్ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. క్లోజప్‌లో కిల్లర్ లేడీలా మారిపోయింది. మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తుంది. కృతి శెట్టి కసి చూపులకు కుర్రాళ్ల బేజారెత్తిపోతున్నారు. దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు..
