దేశం లోపల మనుషులు హాయిగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం, బోర్డర్‌లో సైనికులు కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తుండటమే. దేశాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. దేశ సేవలో తరించే సైనికులు దేశంలోపల కూడా సేవ చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సైనికులు సదా వెంట ఉండి రక్షిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి దేశంలో జరిగింది. ఓ ముదుసలి మహిళ మూసిఉన్న దుకాణం ముందు నిద్రపోయింది. షాపు మూసి ఉండటంతో అక్కడే పడుకున్నది. అయితే, షాపు యజమాని అక్కడికి వచ్చి ఆమెను లేవమని చెప్పాడు, కాలితో తన్నాడు, బాటిల్లోని నీళ్లు ఆమెపై పోశాడు. నిద్రలేచిన ముసలావిడ ఆ యజమాని కాళ్లకు దణ్ణం పెట్టింది. అయినా ఆయన కనికరించలేదు. దూషించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్మీ జవాన్ ఆ దృశ్యాలను చూశాడు. షాపు యజమానిని వారించాడు. కానీ, అతను కరుణించలేదు. వెంటనే ఆర్మీ జవాన్ షాపు యజమానితో గొడవపడ్డాడు. తరువాత ఆ ముసలి అవ్వను చిన్నంగా అక్కడి నుంచి లేపి అమెకు కొంత డబ్బులు ఇచ్చి తలను సరిచేసి చెప్పులు తొడిగి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇండియాలో ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగాని, ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం వైరల్ అవుతున్నది. ఎక్కడైనా సైనికుడు సైనికుడే, మానవత్వానికి వందనం అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
Read: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో హృదయ విదారక దృశ్యం: చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనా…!!
