Site icon NTV Telugu

Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా..

Untitled Design (4)

Untitled Design (4)

మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది. బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.. కొందరు ప్రైవేట్ అనేవి ఉంటాయా అని అడిగానా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. మనం ఇప్పటి వరకు వాటిని చూసి ఉండకపోవచ్చు. ఇతర దేశాల్లో చాలా చోట్ల ప్రైవేట్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు. అయితే మన దేశంలో కూడా ఈ ప్రైవేట్ రైలును లాంచ్ చేశారు.

Read Also:Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు..

ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వేలు వివిధ రకాల రైలు సేవలను నిర్వహిస్తాయి. జాతీయ రవాణా సంస్థ 2019లో రైలు ప్రయాణికుల కోసం దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రారంభించింది. అయితే ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్‌ప్రెస్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నుండి లక్నో వరకు నడుస్తుంది. ఇది అక్టోబర్ 4, 2019న తన మొదటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఎంతో ప్రజాదారణ పొందిన ఈ రైలు న్యూఢిల్లీ నుంచి లక్నో వరకు నడుస్తోంది.

Read Also:Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య..

ఈ ప్రైవేట్ రైలు ప్రారంభించి దాదాపుగా ఐదేళ్లు కావస్తోంది. అయితే అదే మార్గంలో ప్రయాణిస్తునన రాజధాని, శతాబ్ధి, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సర్వీసుల కంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది. న్యూఢిల్లీ–లక్నో మధ్య నడిచే IRCTC తేజస్ ఎక్స్‌ప్రెస్ రెండు రకాల సీట్లను అందిస్తుంది. AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. అదేవిధంగా శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఒకే రకమైన సీటింగ్ ఎంపికలను అందిస్తాయి. అయితే సుదూర రైలు కావడంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ AC స్లీపర్ క్లాస్‌ను మాత్రమే అందిస్తుంది..

Exit mobile version