Three major road accidents in India: మరికొన్ని రోజుల్లో 2025 ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది మిగిల్చిన దారుణాలు అన్ని ఇన్నీ కావు.. ఎన్నో ప్రమాదాలు జరిగాయి.. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు అనే మందిని మృత్యువు వెంటాడి వేటాడింది. మొన్న కర్నూలు, నిన్న జైపూర్, చేవేళ్ల ప్రమాదాలు తీవ్ర విషాధాన్ని మిగిల్చాయి. అయితే.. ఈ మూడు ప్రమాదాల్లో ఒక కీలక పాయింట్ ఉంది. ఈ మూడూ రోడ్డు ప్రమాదాలే అంతే కాదు.. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కామన్‌గా ఉంది. కావేరి బస్సు దగ్ధం, చేవెళ్ల ప్రమాదం, జైపూర్ యాక్సిడెంట్‌లో 19 చొప్పున జనాలు మరణించారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో డేంజర్ 19 ట్రెండ్ అవుతుంది..
READ MORE: Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కిందికి దింపేసిన సిబ్బంది..
చేవెళ్ల ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర లోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై నిన్న (సోమవారం) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందారు. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు సగ భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.
బస్సు ప్రమాదానికి 12 ప్రమాద కారణాలు:
1. టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్.
2. రోడ్డుపై గొయ్యి, మలుపు.
3. గొయ్యి రావడంతో కంట్రోల్ తప్పిన టిప్పర్.
4. ఢీకొట్టకా బస్సు పై పడిన టిప్పర్.
5. కంకరపై టార్ఫాలిన్ పట్టలేకపోవడం.
6. కంకర మొత్తం ప్రయాణికులపై పడటం.
7. డ్రైవర్ వైపు సీట్లన్నీ తుక్కు తుక్కు.
8. ఆర్టీసీ బస్సు ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్.
9. బస్సులో సీట్ల కెపాసిటీ మించి ప్రయాణికులు.
10. టిప్పర్ లో 35 టన్నులకు బదులు 60 టన్నులు కంకర.
11. అనుమతి లేకున్నా ఆ రూట్ లో హెవీ వెహికల్స్ తిరగడం.
12. ఒక్కసారిగా కంకర మీద పడటంతో ఆగిపోయిన ఊపిరి.
READ MORE: Ex-MLA Bhumana: పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలకు శాశ్వత నివాసం- పవన్ సూచనకు అభినందనీయం
కర్నూలు బస్సు దగ్ధం..
గాఢ నిద్రలో ఉన్న ఆ ప్రయాణికులకు తెలియదు, తాము ప్రయాణిస్తున్నది గమ్యస్థానానికి కాదని, మృత్యుఒడిలోకి అని. జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్నిగోళంగా మారి, 20 మందికి పైగా ప్రయాణికులను సజీవ దహనం చేసిన ఘోర విషాదం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో, నిద్రలోనే అనేకమంది అగ్నికి ఆహుతయ్యారు. అసలు ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది..? నిద్రలోనే అంతమంది ప్రాణాలు గాలిలో కలవడానికి కారణమేంటి..? హైదరాబాద్ నుంచి బెంగళూరుకు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చెందిన ‘వేమూరి కావేరి ట్రావెల్స్’కు చెందిన వోల్వో బస్సు, (నెంబర్ DD 01 N 9490) సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కర్నూలు జిల్లా సమీపంలోకి రాగానే, జాతీయ రహదారిపై బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నిగోళంగా మారింది. నిద్రలోనే సజీవ దహనం : ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల్లో అధిక శాతం గాఢ నిద్రలో ఉన్నారు. అప్రమత్తమైన ఇద్దరు డ్రైవర్లు, మరో 12 మంది ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టుకుని, ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.
READ MORE: Ex-MLA Bhumana: పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలకు శాశ్వత నివాసం- పవన్ సూచనకు అభినందనీయం
నిన్న రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రయాణిస్తున్న వాహనాలపై డంపర్ ట్రక్ దూసుకెళ్లింది. ఐదుకిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మందికి పైగా మృతి చెందారు. యాబై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 17కు పైగా వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. జైపూర్ నగరంలోని హర్మదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ డంపర్ ట్రక్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన డంపర్ ట్రక్ ముందుగా ఓ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీ కొడుతూ మరో రెండు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు, బైకులు, పాదచారులు అన్నీ డంపర్ ట్రక్ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి. అయినప్పటికీ ట్రక్ డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డంపర్ డ్రైవర్ మద్యం సేవించినట్లు సమాచారం. ఐదు కిలోమీటర్ల మేర అతను వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
