తెలుగు న్యూస్ ఛానెల్స్ చరిత్రలో వినూత్న ప్రయోగాలకు వేదిక ఎన్టీవీ న్యూస్. మన దేశం మనగీతం అంటూ యువతీయువకుల్లో దేశభక్తిని ప్రేరేపించింది. తాజాగా దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభవేళ హైదరాబాద్ నగరంలో సరికొత్త ప్రయోగం నిర్వహించింది ఎన్టీవీ లైఫ్ స్టయిల్. అమ్మాయిలు, అబ్బాయిలు, లింగ భేదం, వయసుతో సంబంధం లేకుండా ఫ్రీ హగ్ సోషల్ ఎక్స్ పరిమెంట్ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాల్లో విభిన్న వ్యక్తులు, సమూహాల మధ్యఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీవీ.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనమంతా ఒక్కటే… కులమత వర్ణవర్గ, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా భారతీయులంతా ఒక్కటే అని నిరూపించారు. అన్ని వర్గాల వారు ఆలింగనం చేసుకుని మంచి స్ఫూర్తిని చాటుకున్నారు. మతసామరస్యానికి మన దేశం పట్టుగొమ్మ, మతం, కులం, ప్రాంతం కంటే దేశం ఉతృష్టమయినదని నిరూపించారు. ఇలాంటి వినూత్న వేదికను ఆవిష్కరించిన ఎన్టీవీని పలువురు అభినందించారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్య స్ఫూర్తికి అద్దం పట్టేలా ఒకటే జెండా.. జనానిది ఒకటే అజెండా తరహాలో ఈ కార్యక్రమానికి అనూహ్యమయిన ఆదరణ లభించింది.