Site icon NTV Telugu

Baal Aadhaar: బాల్ ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

Untitled Design (5)

Untitled Design (5)

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆధార్ ఎంతో అవసరం. ఆధార్ లేనిది ఏ పని జరగడంలేదు. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు బాల్ ఆధార్ గుర్తింపు కార్డ్ ఇస్తారు. బయోమెట్రిక్స్ అవసరం లేకుండా, తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ తో ఈ బాల్ ఆధార్ ఇస్తారు. దీనికోసం మనం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు వీటితో జత చేయాల్సిన అవసరం ఉంటుంది.

Read Also: Sweet Potatoes: చిలగడ దుంపలు తినడం వల్ల ఎన్ని లాభాయిన్నాయో.. మీకు తెలుసా..

ఆధార్ కార్డ్ మన దేశంలో ఓ గుర్తింపు కార్డుగా మారిపోయింది. అయితే నవజాత శిశువుల కోసం బాల్ ఆధార్ అనే ప్రత్యేక వెర్షన్ అందుబాటులో ఉంది. ఇందులో పిల్లల పేరు, ఫొటో, పుట్టిన తేదీ, జెండర్ ఉంటాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ నంబర్‌తో లింక్‌ చేసి బాల్ ఆధార్ ఇస్తారు. ఐదేళ్ల తర్వాత ఈ బాల్ ఆధార్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాస్‌పోర్ట్ వంటి అనేక ఇతర గుర్తింపు పత్రాలు ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సిన అవసరం ఉన్నందున. మీ నవజాత శిశువుకు బాల్ ఆధార్ కార్డు తీసుకోవడం మరింత అవసరం అవుతుంది. ముఖ్యంగా మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆలోచిస్తుంటే. దాని కోసం అవసరమైన అన్ని దశలు, పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also:Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య

బాల్ ఆధార్ (5 సంవత్సరాల లోపు పిల్లలకు) కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా UIDAI వెబ్‌సైట్‌ కి వెళ్లాలి.. అందులో ..“నా ఆధార్” “అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి” అనే ఆఫ్షన్ ను ఎంచుకోవాలి… తర్వాత… మీ నగరం, మొబైల్ నంబర్‌ను ఎంచుకోవాలి. దానిలో మీ మైబైల్ కు వచ్చిన ఓటీపీని అందులో అప్లై చేయాలి. ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రాన్ని సందర్శించడానికి తేదీ, సమయాన్ని ఎంచుకోండి. ఆ రోజున ఆధార్ లింక్ చేయబడుతున్న తల్లిదండ్రులు బయోమెట్రిక్ ధృవీకరణ ఆధార్ వివరాలను సమర్పించాలి. పిల్లల పత్రాలు, ఫారమ్‌ను సమర్పించండి. ప్రాసెస్ చేసిన తర్వాత, బాల్ ఆధార్ మీ చిరునామాకు మెయిల్ చేయబడుతుంది. మీరు దానిని UIDAI ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఆన్ లైన్ లో అప్లై చేసుకోలేకపోతే.. మీకు దగ్గర లోని ఆధార్ సెంటర్ కు వెళ్లి మీ దగ్గర ఉన్న మీ శిశువు బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులలో ఎవరిదో ఒకరి ఆధార్ కార్డ్ దానికి జత చేసి.. అప్లై చేసుకుంటే.. 30 నుంచి 60 రోజుల మధ్యలో మీకు బాల్ ఆధార్ వస్తుంది.

Exit mobile version