సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తుంటే, మరి కొన్ని వీడియోలు మాత్రం ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్విస్తాయి.. జనాల్లో ఉన్న టాలెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇటీవల కొన్ని వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచాన్ని ఉపయోగించి వాహనాన్ని తయారు చేశాడు.. ఆ వెరైటీ వాహనం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఇంట్లో ఉండే మంచాన్ని మూడు చక్రాల వాహనంగా మార్చారు. ఆ కదిలే మంచం వెహికిల్ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు పెట్రోల్ పంప్‌కు రావటం వీడియోలో కనిపించింది. అందులో ఒకరు మంచ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపించింది. అయితే, ఆ వాహనంలో వారు పెట్రోల్ కొట్టించేందుకు వచ్చారు. దీంతో పెట్రోల్ పంపు వద్ద నిలబడి ఉన్న వాహనదారులు, స్థానిక ప్రజలు విచిత్ర వాహనాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.. కొందరు ఈ వాహనాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..దాదాపు 3 నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.. గతంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెట్టారు.. మట్టి కుండ తో ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో అనేకం చూశాం… వీటిని చూసిన వారికి ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు..ఈ వాహనాన్ని తయారు చేయడానికి మంచం, సైకిల్ చక్రాలు, కార్ స్టీరింగ్‌ను ఉపయోగించారు. మంచం నాలుగు కాళ్ల దగ్గర చక్రాలు అమర్చారు. ఒక వైపు హ్యాండిల్, రేస్ మొదలైనవి సెట్ చేశారు. మరోవైపు మోటారు కూడా బిగించి ఉంది. ఇప్పుడు మంచం వాహనం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక నెక్స్ట్ ఎలాంటి ప్రయోగం తో వస్తారో చూడాలి..
Innovative Juggad | Homemade Khatiya converted into a 3 wheeler vehicle. pic.twitter.com/COZg67GZjY
— MUMBAI NEWS (@Mumbaikhabar9) June 9, 2023