రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పైలట్ అవసరం లేకుండానే నడిచే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ల ప్రయాణాన్ని రద్దుచేస్తుంటారు. కానీ, పైలట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలికాఫ్టర్లను తయారు చేస్తున్నారు. ఇలాంటి హెలికాఫ్టర్ ఇటీవలే ఆకాశంలో చక్కర్లు కొట్టింది. టేకాఫ్ నుంచి 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది.
Read: Donald Trump: కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ దోస్తీ…
నాలుగు వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణం చేసింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయిం. యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ లో భాగంగా ఈ అలియాస్ అనే హెలికాఫ్టర్‌ను కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ బేస్ నుంచి ట్రయల్స్‌ను నిర్వహించారు. త్వరలోనే వీటిని ఆర్మీలో ప్రవేశపెట్టనున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ పైలట్ రహిత హెలికాఫ్టర్‌లు సులభంగా ప్రయాణం చేయడమే కాకుండా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా ఈ హెలికాఫ్టర్ సురక్షితంగా ప్రయాణం చేస్తుందని అలియాస్ అధికారులు చెబుతున్నారు.
