కరోనా మహమ్మారి కాలంలో మాస్క్‌ను తప్పని సరి చేయడంతో బయటకు వెళ్లే వ్యక్తులు మాస్క్ పెట్టుకొని వెళ్తున్నారు. శుభకార్యాలకు హాజరైనా సరే మాస్క్ తప్పనిసరి. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు వేస్తున్నారు. పెళ్లి చేసుకునే వధూవరులు కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ తప్పని సరి కావడంతో వెరైటీ వెరైటీ మాస్క్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. పెళ్లిళ్ల కోసం కొత్తగా ఫ్లోరల్ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. మామూలు మాస్క్‌లపై అందంగా పూలను అలంకరించి వీటిని తయారు చేస్తారు. ఈ మాస్క్‌లు ధరించడం వలన ప్రత్యేకంగా కనిపిస్తారు. శ్రావణమాసం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ తరహా ఫ్లోరల్ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది.
నయా ట్రెండ్: పెళ్లిళ్లలో పూల మాస్కులు…
