Site icon NTV Telugu

వైర‌ల్‌: ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఫైర్ బాల్స్‌…

అనంత‌మైన విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్ర‌హాలు, ఉప‌గ్రహాలు, ఉల్క‌లు ఉన్నాయి.  అప్పుడ‌ప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూవాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించి మండిపోతూ భూమిపై ప‌డుతుంటాయి.  జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమీని ఢీకొట్ట‌డం వ‌ల‌నే ఆ భారీ జంతువులు న‌శించిపోయాయి.  అయితే, అప్పుడ‌ప్పుడు మ‌న‌కు ఆకాశంలో రాలిప‌డుతున్న న‌క్ష‌త్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్క‌లు క‌నిపిస్తుంటాయి.  ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మ‌రోసారి క‌నిపించాయి.  

Read: హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్!

పెద్ద‌వైన ఫైర్‌బాల్స్ కాంటివంతంగా మండుతూ భూమివైపుకు దూసుకురావ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెందారు.  అయితే, ఈ ఫైర్ బాల్స్ కార‌ణంగా ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌లేదు.  దీనికి సంబందించిన వీడియోల‌ను నాసా చిత్రీక‌రించింది.  సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఈ ఫైర్‌బాల్స్‌ను వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీనికి సంబందించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఇలాంటి దృశ్యాలు గ‌తంలో చూడ‌లేద‌ని కొంద‌రు చెబుతుంటే, మ‌రికొంద‌రు మాత్రం ఇవి స‌హ‌జ‌మే అని చెబుతున్నారు

Exit mobile version