Site icon NTV Telugu

Heartbreaking video: వైరల్‌గా మారిన పెద్దాయన వీడియో.. కంటతడి పెట్టిస్తోంది..!

Elderly Man

Elderly Man

సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత రకరకాల వీడియోలో అందులో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి.. కొన్ని హాస్యాన్ని పంచితే.. కొన్ని జోష్‌ పెంచుతాయి.. కొన్ని హృదయాన్ని కదిలిస్థాయి.. మరికొన్ని హృదయాన్ని బరువెక్కించి కంటతడి పెట్టిస్తుంటాయి.. ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కిన ఓ వృద్ధుడి వీడియో అందరితో కంటతడి పెట్టిస్తుంది.. ఒక వృద్ధుడు తన రోజువారీ సంపాదనను లెక్కిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఆ హృదయ విదారక క్లిప్ ఇంటర్నెట్‌ను కన్నీళ్లకు గురిచేస్తోంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను జిందగీ గుల్జార్ హై అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. చిన్న క్లిప్‌లో, ఒక వృద్ధుడు రోజంతా సంపాదించిన డబ్బును లెక్కించడం చూడవచ్చు. తన గుడిసెలో కూర్చొని నెమ్మదిగా తన సంపాదనను లెక్కిస్తున్నట్టు.. చాలా జాగ్రత్తగా చిల్లరను కూడా కౌంట్‌ చేస్తున్నాడు..

Read Also: PM CARES Fund: పీఎం కేర్స్‌ ఫండ్‌ ట్రస్టీగా రతన్‌ టాటా…

ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆ వృద్ధుడి వీడియో దాదాపు 3 లక్షల వీక్షణలను సంపాదించింది. ఈ క్లిప్‌ను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. “మీ వద్ద ఉన్నవాటిని మెచ్చుకోండి. కొందరికి మీ చిన్న గది, తక్కువ ఆదాయం, స్మార్ట్ గాడ్జెట్లు మొదలైనవి కూడా విలాసవంతమైనవి. కృతజ్ఞత చూపండి. దయతో ఉండండి” అని ఒక నెటిజన్‌ కామెంట్‌ రాశాడు.. “చాలా హత్తుకునేది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు” అంటూ మరో నెటిజన్‌ వ్యాఖ్యానించాడు.. కాగా, ఓ పక్కన నది పారుతుండగా.. చిన్న గుడిసెలో కూర్చొన్న ఓ వృద్ధుడు.. తన రోజువారీ సంపాదన లెక్కిస్తున్నాడు.. నిజంగా జీవితం అందరికీ ఒకేలా ఉండదు అని చెప్పకనే ఆ దృశ్యాలు చెబుతున్నాయి.. ఎందుకంటే.. కొడుకులు, మనవళ్ల మధ్య ఖుషీగా జీవితాన్ని గడపాల్సిన సమయంలో.. ఇంకా ఆ వృద్ధుడు జీవన పోరాటం చేస్తున్నాడంటే.. అతడి పరిస్థితి ఏంటి? ఆయన కొచ్చిన కష్టం ఏంటో మరి.. మొత్తంగా.. పెద్దాయన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. వీడియోలు సోషల్‌ మీడియాకు ఎక్కిన తర్వాత కొందరి జీవితాలు మారిపోయాయి.. మరి.. ఈ పెద్దాయన జీవితం కూడా మారిపోవాలని ఆశిద్దాం..

https://twitter.com/Gulzar_sahab/status/1572173242227634176

Exit mobile version