విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు… ఆ శునకం షాపుకు వెళ్లి లిస్ట్‌లో ఉన్న వస్తువులను కొనుగోలు చేసి తీసుకొని వస్తుంది. చిల్లరతో సహా సంచిలో తీసుకొని వస్తుంది. ఈ శునకానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://www.youtube.com/watch?v=ueXDipfEbwk
Read: విమెన్ హాకీ టీంకు “తూఫాన్” హీరో విషెష్…. దారుణంగా ట్రోలింగ్
