Site icon NTV Telugu

Names of 100 Kouravas: మహాభారతంలో 100 మంది కౌరవుల పేర్లు తెలుసా.. ఎప్పుడైనా విన్నారా?

Kouravas 100 Names

Kouravas 100 Names

Do You Know Names of 100 Kouravas Here is the Full list: మహాభారతం తెలిసిన వారు చాలా మంది ఉంటారు కానీ అందరికీ కౌరవులు అనగానే 100 మంది పాండవులు 5 మంది అని మాత్రమే తెలుసు. కానీ కౌరవుల పేర్లలో రెండు మూడు తప్ప మిగతావి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ధుర్యోధనుడు అందరికన్నా పెద్దవాడు, అసలైన వాడు కాబట్టి అందరికీ తెలుసు తెలుసు. దుశ్సాసనుడు చీర లాగాడు కాబట్టి, దుశ్మలుడు ..ద్రౌపది చీర లాగకుండా ధర్మం మాట్లాడాడు కాబట్టి తెలుసు. ఇక మిగిలిన వారందరి పేర్లు ప్రత్యేకంగా తెలీవు. కానీ కన్నడ సింగర్ ఒకాయన తాజాగా జీ కన్నడ ప్రోగ్రాం లో పాడిన పద్యం వైరల్ అవుతోంది.

Kiran Abbavaram: రహస్యతోనే పెళ్లి.. రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న కిరణ్ అబ్బవరం

నిజానికి వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆయన గాయాలకు గాంధారి సేవ చేసి, ఆయనకు కావలసిన సపర్యలు చేస్తుంది. ఆయన సంతోషంగా నీకు ఎలాంటి కోరిక ఉన్నా తీరుస్తాను అని ఆమెకు ప్రమాణం చేయగా గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరుతుంది. దీంతో మహర్షి వరంతో గాంధారికి వంద మంది పుత్రులు కలుగుతారు. వీరినే కౌరవులుగా మహాభారతంలో చెబుతారు. ఇక ఈ వంద మంది పేర్లు చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకోసం

1. దుర్యోధనుడు
2. దుశ్సాసనుడు
3. దుస్సహుడు
4. దుశ్శలుడు
5. జలసంధుడు
6. సముడు
7. సహుడు
8. విందుడు
9. అనువిందుడు
10. దుర్దర్షుడు
11. సుబాహుడు
12. దుష్పప్రదర్శనుడు
12. దుర్మర్షణుడు
13. దుర్మఖుడు
15. దుష్కర్ణుడు
16. కర్ణుడు
17. వివింశతుడు
18. వికర్ణుడు
19.శలుడు
20. సత్వుడు
21. సులోచనుడు
22. చిత్రుడు
23. ఉపచిత్రుడు
24. చిత్రాక్షుడు
25. చారుచిత్రుడు
26. శరాసనుడు
27. ధర్మధుడు
28. దుర్విగాహుడు
29. వివిత్సుడు
30. వికటాననుడు
31. నోర్ణనాభుడు
32. నునాభుడు
33. నందుడు
34. ఉపనందుడు
35. చిత్రాణుడు
36. చిత్రవర్మ
37. సువర్మ
38. దుర్విమోచనుడు
39. అయోబావుడు
40. మహాబావుడు
41. చిత్రాంగుడు
42. చిత్రకుండలుడు
43. భీమవేగుడు
44. భీమలుడు
45. బలాకుడు
46. బలవర్థనుడు
47. నోగ్రాయుధుడు
48. సుషేణుడు
49. కుండధారుడు
50. మహోదరుడు
51. చిత్రాయుధుడు
52. నిషింగుడు
53. పాశుడు
54. బృఎందారకుడు
55. దృఢవర్మ
56. దృఢక్షత్రుడు
57. సోమకీర్తి
58. అనూదరుడు
59. దఢసంధుడు
60. జరాసంధుడు
61. సదుడు
62. సువాగుడు
63. ఉగ్రశ్రవుడు
64. ఉగ్రసేనుడు
65. సేనాని
66. దుష్పరాజుడు
67. అపరాజితుడు
68. కుండశాయి
69. విశాలాక్షుడు
70. దురాధరుడు
71. దుర్జయుడు
72. దృఢహస్థుడు
73. సుహస్తుడు
74. వాయువేగుడు
75. సువర్చుడు
76. ఆదిత్యకేతుడు
77. బహ్వాశి
78. నాగదత్తుడు
79. అగ్రయాయుడు
80. కవచుడు
81. క్రధనుడు
82. కుండినుడు
83. ధనుర్ధరోగుడు
84. భీమరధుడు
85. వీరబాహుడు
86. వలోలుడు
87. రుద్రకర్ముడు
88. దృణరదాశ్రుడు
89.అదృష్యుడు
90. కుండభేది
91. విరావి
92. ప్రమధుడు
93. ప్రమాధి
94. దీర్గరోముడు
95. దీర్గబాహువు
96.ఉడోరుడు
97. కనకద్వజుడు
98. ఉపాభయుడు
99. కుండాశి
100. విరజనుడు
101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Exit mobile version