NTV Telugu Site icon

Devil Twitter Review: డెవిల్ ట్విట్టర్ రివ్యూ..కళ్యాణ్ రామ్ ఊచకొత.. సినిమా బ్లాక్ బాస్టరా?

Devill

Devill

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భీంసారా తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. విడుదలకు ముందే పోస్టర్స్,టీజర్, ట్రైలర్‏తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ మూవీను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.. ఒక్కో సినిమాకు కొత్త కోణంలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు..

ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కళ్యాణ్ రామ్. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు (డిసెంబర్ 29)న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ కు పాజిటివ్ టాక్ వస్తుంది… వన్ మ్యాన్ షోలాగా సినిమాను తన భుజాల పై వేసుకొని నడిపించాడనే టాక్ ను అందుకున్నాడు.. ఇక బీజీఎం హైలెట్ అని అంటున్నారు. అలాగే ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని.. మాస్ ఊచకోత అంటున్నారు..

ఇక నందమూరి ఫ్యాన్స్ తో పాటు.. సినీ అభిమానులు సైతం ట్విట్టర్ వేధికగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను ఇస్తున్నారు.. కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో అని.. బీజీఎం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. కళ్యాణ్ రామ్ మాస్ ఊచకోత.. బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫామ్ అంటున్నారు.. ఫస్ట్ హాఫ్ బాగుందని.. ఇక సెకండ్ హాఫ్ మాస్ అంటున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద డెవిల్ ఊచకోతే.. మాములుగా లేదని, టైటిల్ కు తగ్గట్లు సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియాలో హోరేత్తిస్తున్నారు.. మొత్తానికి సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..