Site icon NTV Telugu

Warner: కొత్త లుక్ లో అదరగొడుతున్న వార్నర్

Sam (7)

Sam (7)

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. షార్ట్ హెయిర్‌తో కనిపించే వార్నర్, ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వచ్చింది” అని పేర్కొన్నాడు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ మరోసారి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో నటించిన “రాబిన్ హుడ్ ” అనే సినిమాలో నటించిన విషయం కూడా ప్రస్తావించబడింది. కొందరైతే రాజమౌళి సినిమాలో విలన్ గా నటిస్తున్నారా అంటూ కామెంట్స్ సైతం పెడుతున్నారు. ఎంతైనా క్రికెట్ లోనూ.. హెయిర్ స్టైల్ లోనూ డేవిడ్ వార్నర్ కు ఆయనే సాటి అంటున్నారు నెటిజన్లు.

తాజాగా మహేష్ – రాజమౌళి మూవీలో ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ విలన్ గా నటిస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. మహేష్ బాబు కూడా అదే స్టైల్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. మరో వైపు ఈ కొత్త లుక్ ని చూసి ధోనిలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Exit mobile version