కొలీవుడ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ గుండె పోటుకు గురై ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..48 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరిని కదిలించి వేస్తుంది. గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు..
డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. చిత్తూరుకు చెందిన డేనియల్ తండ్రి ఒక తెలుగువాడు కాగా, తల్లి తమిళియన్.. ఈయన జీవితం పూల పాన్పు కాదు ఎన్నో కష్టాలను చుసాడని తెలుస్తుంది.. కేరీర్ మొదట్లో ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సీరియల్స్ లో నటించాడు.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడు, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. తమిళ్, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు..
తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించారు డేనియల్.. అయితే బ్రతున్నప్పుడు అందరికీ సంతోషాన్ని పంచిన ఆయన చనిపోతూ ఇద్దరికీ వెలుగు నింపాడు.. రెండు కళ్ళు ఆపరేషన్ చేసి భద్ర పరిచారు. ఇద్దరు అంధులకు ఆ కళ్ళు అమర్చనున్నారు. ఆయన మరణానికి ముందు డేనియల్ బాలాజీ తన కళ్ళను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.. అతను గొప్ప మనసుకు జనం మెచ్చుకుంటున్నారు.. ఇక అతని మృతి వార్త తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు… ఆయన అంత్యక్రియలకు భారీ సినీ ప్రముఖులు, అభిమానులు హాజరుకానున్నారని తెలుస్తుంది…