NTV Telugu Site icon

ఢిల్లీలో కాకులకు కరువు… ఈ పెద్దాయనకు అదే ఉపాధి… 

భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు.  చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు.  ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది.  పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి.  కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి.  దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు.  అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు.  రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు.  అవే ఇప్పుడు ఆ పెద్దాయనకు ఉపాధి కల్పిస్తున్నాయి.  నగరంలో పిండ ప్రధానం చేసిన సమయంలో కాకులు అవసరం. కాకులు పిండాలను తింటూ డబ్బులు సంపాదించిపెడుతున్నాయి.  కాకులకు కడుపు నిండుతోంది.  ఆ పెద్దాయనకు జేబులు నిండుతున్నాయి.  మహాకవి శ్రీశ్రీగారు చెప్పినట్టుగా వ్యాపారానికి కాదేది అనర్హం చెప్పండి.