Site icon NTV Telugu

ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన విమానం… బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు…

ఒక‌ప్పుడు ఒక‌చోట నుంచి మ‌రోచోటుకి ప్ర‌యాణం చేయాలంటే న‌డిచి వెళ్లేవారు. ఆ త‌రువాత చిన్న చిన్న వాహ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి. రైట్ సోద‌రులు విమానం క‌నుగొన్న త‌రువాత ప్ర‌యాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్ర‌యాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మ‌రోక దేశానికి ప్ర‌యాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బ‌ట్టి స‌మ‌యం ఉంటున్న‌ది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వ‌చ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాల‌ని అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిట‌న్‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. చాలా కాలంగా ప్ర‌యోగాలు చేస్తున్నాయి. అయితే, చైనా ఈ విష‌యంలో అంద‌రికంటే ముందు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Read: పాక్‌లో దారుణం: ఉగ్ర‌వాదుల దాడిలో 100 మంది సైనికులు మృతి…

చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేష‌న్ హైస్పీడ్ విమానాన్ని త‌యారు చేసింది. ఆ సంస్థ ప్ర‌క‌టించిన ప్ర‌కారం చైనా రాజ‌ధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ వ‌ర‌కు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే ప్ర‌యాణిస్తుంద‌ని, గంట‌కు 2600 కిమీ వేగంగా ప్రయాణిస్తుంద‌ని చైనా ప్ర‌క‌టిస్తుంది. జెట్ విమానాల కంటే ఆరురెట్ల వేగంగా ప్ర‌యాణం చేస్తుంద‌ని, టీయాంక్సింగ్ 1, టియాంక్సింగ్ 2 గా పిలిచే ఈ సూప‌ర్ సోనిక్ విమానాల‌ను చైనా సంస్థ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన‌ట్టు తెలియ‌జేసింది. 2024 నుంచి ఈ సూప‌ర్‌సోనిక్ విమానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.

Exit mobile version