కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నేడు (మే 21) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మలయాళ చిత్రసీమలోని ఉత్తమ నటులలో ఒకరైన మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలుగా 300కి పైగా చిత్రాలలో నటించారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ లాల్ త్వరలో “ఆరట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ రాసిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సిద్దిక్, నేదుముడి వేణు, సాయి కుమార్, స్వాసికా, రాచన నారాయణన్ కుట్టి కూడా నటించారు. ప్రియదర్శన్ “మరక్కర్: అరబికడలింటే సింహాం” చిత్రంలో కూడా మోహన్ లాల్ నటిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ “బారోజ్” చిత్రంతో మోహన్ లాల్ దర్శకుడిగా మారారు. జిజో పున్నూస్ నవల ‘బారోజ్ : గార్డియన్ ఆఫ్ డి గామా ట్రెజర్’ ఆధారంగా ‘బారోజ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిమానులు లాలెట్టన్ అని ప్రేమగా పిలుచుకునే ఈ సూపర్ స్టార్ ఆయన అభిమానుల ట్వీట్లతో శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్ లో # హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్, # హ్యాపీ బర్త్ డే లాలెట్టన్, # లాలెట్టాన్ 61 వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మోహన్ లాల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకూ ఉన్న సినిమా స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, తోవినో థామస్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, నివిన్ పౌలీ, ఫహద్ ఫాసిల్, రాధికా శరత్‌కుమార్, వెంకటేష్ దగ్గుబాటి, కిచ్చా సుదీప్, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో మోహన్ లాల్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
మోహన్ లాల్ కు సెలెబ్రిటీల బర్త్ డే విషెష్
