Site icon NTV Telugu

విచిత్రం:  బుల్లెట్టు బండి పాట పెడితేనే … ఆ కొండ‌ముచ్చు…

ఇటీవ‌ల కాలంలో బుల్లెట్టు బండి పాట ఎంత ఫేమ‌స్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు.  ఓ న‌వ వ‌ధువు ఈ పాట‌కు చేసిన డ్యాన్స్‌తో పాట హైలైట్ అయింది.  ఆ వీడియో ఫేమ‌స్ కావ‌డంతో ఆ పాట‌కు అనేక మంది డ్యాన్స్ చేస్తూ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  అయితే,  ఈ పాట మాములు జనాల‌కు మాత్ర‌మే కాదు, అటు జంతువుల‌కు కూడా విప‌రీతంగా న‌చ్చుతున్న‌ది.  ఎంత‌గా అంటే, ఆ పాట వింటేనే పాలు తాగేంత‌గా న‌చ్చుతుంద‌ట‌.  మ‌హ‌బూబాబాద్ లోని కంబాల‌పల్లె గ్రామంలో ఓ వ్య‌క్తి కిరాణా దుకాణం న‌డుపుతున్నాడు.  కోతుల బెడ‌ద ఎక్కువ‌గా ఉండ‌డంతో కొండ‌ముచ్చును తెచ్చి పెంచుతున్నాడు.  దానికి ఓ పిల్ల కూడా ఉంది.  కొన్ని రోజుల క్రితం తల్లి అనారోగ్యంతో మ‌ర‌ణించింది.  అప్ప‌టి నుంచి ఆ పిల్ల పాలు తాగ‌డం మానేసింది.  ఓ రోజు మొబైల్‌లో బుల్లెట్టు బండి పాట విన్న‌ది.  ఆ పాట వింటూనే ఆ కొండ‌ముచ్చు పాలు తాగేసిందట‌.  అప్ప‌టి నుంచి కొండ‌ముచ్చుకు పాలు ఇవ్వాలి అనుకున్న‌ప్పుడు ఆ పాట‌ను ప్లే చేస్తున్నారు.  

Read: వైర‌ల్‌:  ఇది డ్రోన్ కాదు… చిలుకే… వీడియో ఎలా తీసిందో చూశారా…!!

Exit mobile version