NTV Telugu Site icon

Animal Movie Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమల్ కలెక్షన్స్..11 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..?

Animal

Animal

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘యానిమల్ ‘ ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకోవడంతో కాసుల వర్షం కురిపిస్తుంది.. ఇక డిసెంబర్ 1న విడుదలైన ఈ సూపర్ హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ మూవీపై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ను ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

ఈ రణబీర్ కపూర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ 10 వ రోజు కూడా యానిమల్ మంచి వసూళ్లను రాబట్టింది.. ఇకపోతే 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 61 కోట్లు, నాలుగో రోజు 38 కోట్లు, ఐదో రోజు 32 కోట్లు, 6వ రోజు 26 కోట్లు, 7వ రోజు 22 కోట్లు, 8వ రోజు 21 కోట్లు, 10 వ రోజు 34 కోట్లు. టోటల్ కలెక్షన్ రూ.717. 46 కోట్లు రాబట్టింది..ఈ వారంలో రూ. 1000 కోట్లు రాబడుతుందని అంచనా.. ఇది మామూలు విషయం కాదు..

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం వల్ల రణభీర్ రేంజ్ మూర్తిగా మారిపోయింది.. రణబీర్ నటన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మిక మందన్న ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2వ వారాంతంలో ‘యానిమల్’ మంచి వసూళ్లు రాబడుతోంది.. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుంద అని త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది.. ఈ వారం ఎండింగ్ లో కలెక్షన్స్ మరింత పెరగనున్నాయని సమాచారం..