Site icon NTV Telugu

Google: 50 సార్లు ఇంట‌ర్వ్యూలో ఫెయిల్‌… కానీ చివ‌ర‌కు…

టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌పంచం చిన్న‌దైపోయింది. ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది వివిధ మాధ్య‌మాల ద్వారా ఉద్యోగాల కోసం ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌వుతుంటారు. ఒక‌టి రెండు ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లిన త‌రువాత చాలా మంది మ‌నకు ఉద్యోగం రాదేమో అని చెప్పి వెన‌క‌డుగు వేస్తుంటారు. ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వ‌స్తుంది. దీనిని ఎంతోమంది నిరూపించారు. తాజాగా సంప్రీతీ యాద్ అనే 24 ఏళ్ల యువ‌తి మ‌రోసారి దినిని రుజువుచేసింది.

Read: Lockdown Effect: మూడు నెల‌ల్లో 23 ల‌క్ష‌ల ఉద్యోగాలు…

ఇటీవ‌లే ఆమెకు గూగుల్ సంస్థ కోటిరూపాయ‌ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఇచ్చింది. గూగుల్ లో ఉద్యోగం సంపాదించ‌డానికి ముందు 50 ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లింది. అన్నింటా ఫెయిల్ అయింది. అయిన‌ప్ప‌టికీ మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నం చేసింది. ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నం చేస్తే సాధించ‌లేనిది అంటూ ఏదీ ఉండ‌ద‌ని సంప్రీతి యాద్ నిరూపించింది. తాను ఇంట‌ర్వ్యూకు వెళ్లే స‌మ‌యంలో చాలా నెర్వ‌స్‌గా పీల్ అయ్యేదాన్ని అని, ఫ్రెండ్స్‌, కుటుంబ‌స‌భ్యులు త‌న‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ని, పెద్ద‌పెద్ద కంపెనీల‌లో ఉద్యోగాలు ంటే డిస్క‌ష‌న్ లాగే ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది.

Exit mobile version