హాట్ బ్యూటీ ఆండ్రియా బోల్డ్ సీన్ లో నటించబోతోంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. డైరెక్టర్ మిస్కిన్ నెక్స్ట్ మూవీ “పిసాసు 2”. దర్శకుడు మిస్కిన్ హిట్ హర్రర్ డ్రామా “పిసాసు”కు సీక్వెల్ గా “పిసాసు 2” రూపొందుతోంది. “పిసాసు” చిత్రం 2014 లో విడుదలైంది. ఈ సీక్వెల్ లో ఆండ్రియా ఒక ఆంగ్లో-ఇండియన్ పాత్రను పోషిస్తోంది. అందులో ఆండ్రియా హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కనిపించబోతోంది అనే గాసిప్ వైరల్ అవుతోంది.
Also Read : 30 కోట్ల నుంచీ 400 కోట్ల దాకా… బాలీవుడ్ కు బంపర్ ఆఫర్స్ ఇస్తోన్న ఓటీటీలు!
ఇటీవల ట్విట్టర్ స్పేసెస్ సెషన్‌లో మిస్కిన్ తన సినిమాలో ఆండ్రియా పాత్ర గురించి ఓపెన్ అయ్యారు. ఈ చిత్రంలో ఆండ్రియా నటనకు జాతీయ అవార్డు లభిస్తుందని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ సెషన్ లోనే విజయ్‌తో కలిసి జేమ్స్ బాండ్ చిత్రం చేయాలనుకుంటున్నానని మిస్కిన్ వెల్లడించాడు. మిస్కిన్ ఇటీవల విశాల్‌తో వివాదం తరువాత “తుప్పరివాలన్” సీక్వెల్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత అతను ఆండ్రియాతో “పిసాసు 2″ను ప్రకటించాడు.
