Site icon NTV Telugu

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో హృదయ‌ విదారక దృశ్యం: చిన్నారుల భవిష్యత్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా…!!

తాలిబ‌న్లు కాబూల్ న‌గ‌రంలోకి ఎంట‌రయ్యాక ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.  ప్ర‌జ‌లు ఎలాగైనా స‌రే దేశం వ‌దిలి వెళ్లాల‌ని, ఏ దేశం వెళ్లినా ఫ‌ర్యాలేద‌ని చెప్పి ఆస్తులు వ‌దిలేసుకొని ఎయిర్‌పోర్ట్ వైపు ప‌రుగులు తీశారు. సోమ‌వారం నుంచి ఎయిర్‌పోర్ట్‌లో ప‌డిగాపులు కాస్తున్నారు.  అయితే, సాయంత్రం స‌మ‌యంలో తాలిబ‌న్లు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తుండ‌టంతో తాము వెళ్ల‌క‌పోయినా ప‌ర్వాలేదు, ఆఫ్ఘ‌న్ త‌రువాత త‌రం వారినైనా ర‌క్షించాల‌ని ప్ర‌జలు కోరుకొని చంటి బిడ్డ‌ల‌ను ఎలాగైనా ఎయిర్‌పోర్డ్ కంచెను దాటించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ప‌ది, పన్నెండేళ్ల చిన్నారుల నుంచి నెల‌ల వ‌య‌సున్న చిన్నారులను ఎయిర్‌పోర్ట్ కంచె దాటించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఆ వ‌య‌సున్న పిల్ల‌ల‌ను తల్లిదండ్రులు వ‌దిలేసుకొని బ‌త‌క‌డం అంటే క‌ష్ట‌మే.  కానీ, త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో చిన్నారుల‌ను స్వేచ్చ‌గా బ‌త‌కాల‌ని, తాలిబ‌న్‌ల చెర నుంచి ర‌క్షించుకోవాల‌ని మ‌న‌సు చంపుకొని చిన్నారుల‌ను కంచె దాటించి అమెరికా ఆర్మీకి అందిస్తున్నారు. నెల‌లు వ‌య‌సున్న ఓ చిన్నారిని ప్ర‌జ‌లు అమెరిక‌న్ ఆర్మీకి అందిస్తున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయింది.  ఈ ఫొటోను చూసిన ప్ర‌పంచం మొత్తం కంట‌త‌డి పెట్టుకుంటోంది.  తాలిబ‌న్ల నెత్తుటి క్రీడ‌కు అభంశుభం తెలియ‌ని చిన్నారుల భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారిపోతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.  

Read: ఒకప్పుడు ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్ష‌ణ పొందిన‌ వ్యక్తి…ఇప్పుడు తాలిబ‌న్ అగ్రనేతగా మారాడా..!!

Exit mobile version