ఇంగ్లాండ్‌లోని వేల్స్ తీరంలోని బీచ్‌లో అమందా అనే మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఓ వైన్ బాటిల్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని ఇంటికి వెళ్లింది. సముద్రంలో కొట్టుకొని వచ్చింది అంటే అరుదైన వస్తువుగా భావించి భద్రంగా దాచుకుంది. కొన్ని రోజుల తరువాత ఆ వైన్ బాటిల్ కు సంబందించిన ఫొటోలను ఆమె తన కోడలకు పంపింది. వాటిని చూసిన ఆ కోడలు.. ఆ బాటిల్ లో ఏముందో చూడమని చెప్పగా, అమందా బాటిల్ మూత ఒపెన్ చేసింది. అందులో వైన్ లేదు. కానీ, బాటిల్ లో ఓ కాగితం కనిపించింది. అందులో కొన్ని వివరాలతో పాటుగా ఈ మెయిల్ ఉంది. ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే… దొరికింది అని చెప్పి మెయిల్ చేయమని ఉన్నది. వివరాల ప్రకారం కెనడాకు చెందిన జాన్‌గ్రామ్ అనే వ్యక్తి 2020లో బాటిల్ లేఖను ఉంచి సముద్రంలో విసిరేశాడు. అలా కెనడాలోని సముద్రంలో విసిరేసిన బాటిల్ 4800 కిమీ ప్రయాణం చేసి ఇంగ్లాండ్‌లోని వేల్స్ కు చేరుకుంది. ప్రపంచ యుద్దాలు జరిగే సమయంలో సైనికులు యుద్దంలో మరణించే ముందు ఇలానే బాటిల్‌లో లేఖలు ఉంచి సముద్రంలో విసిరేసేవారు. అలా బాటిల్‌లు ఎవరికైనా దొరికితే సైనికుల మరణించిన సైనికుల వివరాలు బయటకు వచ్చేవి.
Read: భూకంపం తరువాత కెరటాలు లేకుండా ఉప్పాడ సముద్రం… ఆందోళనలో మత్స్యకారులు…
