Site icon NTV Telugu

రఘురామపై వైసీపీ ఎంపీల వార్.. కేసులు త్వరగా విచారించాలి

వైసీపీ రెబల్ ఎంపీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ చేయాలన్నారు. లోక్ సభలో వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ.వీ. మిథున్‌రెడ్డి ఈమేరకు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాంస్టర్ రఘురామకృష్ణరాజు. “భారత్‌ థర్మల్‌” పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు మిథున్ రెడ్డి.

చట్టసభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదు. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశారు. వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నుంచి ఎంపీగా ఆయన గెలిచారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు మిథున్ రెడ్డి.

బ్యాంకులను మోసం చేశారు. కాబట్టి, ఆ కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల నేను మీ (స్పీకర్‌ ఛైర్‌) ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. “భారత్‌ థర్మల్‌” పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

Exit mobile version