జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండని… సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవని… బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదని… దీంతో జనం పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పారాసిటమోల్ వేసుకుంటే సరిపోతుందని… ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా… కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని… ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు.
