NTV Telugu Site icon

అక్టోబ‌ర్ 20 నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర‌…

వైఎస్ షర్మిల రేప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌ను చేప‌ట్ట‌బోతున్నారు.  చేవెళ్ల నియోజ‌క వ‌ర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్న‌ది.  చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణ‌లోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది.  ఈ యాత్ర‌కు సంబందించిన మ్యాప్‌ను పార్టీ సిబ్బంది ఇప్ప‌టికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం తిరిగి తీసుకురావాల‌ని, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అందాల‌ని, నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు రావాల‌ని వైఎస్ ష‌ర్మిల పోరాటం చేస్తున్నారు.  నిరుద్యోగ యువ‌త కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం రోజున నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ప్ర‌తి మంగ‌ళ‌వారం రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దీక్షను చేస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి తెలుసుకునేందుకు వైఎస్ ష‌ర్మిల ఈ యాత్ర‌ను చేస్తున్నారు.  వైఎస్ఆర్‌టీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈ యాత్రో పెద్ద ఎత్తున పాల్గొనే అవ‌కాశం ఉన్న‌ది. 

Read: ల‌క్నో విమానాశ్ర‌యంలో విదేశీ బంగారం ప‌ట్టివేత‌…