ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిరుద్యోగ నిరాహార దీక్షను వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఆమె ఈ దీక్షను చేస్తున్నారు. కాగా, రేపు నల్లగొండలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టబోతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్ షర్మిల ఎంజీ యూనివర్శిటీ విద్యార్ధులతో సమావేశం కాబోతున్నారు. విద్యార్థుల సమస్యల గురించి చర్చించనున్నారు. అనంతరం ఉదయం 10:40 గంటలకు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌కు చేరుకొని అక్కడ దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకున్న యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల జిల్లా యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read: చిరంజీవి నన్ను తప్పుకోమన్నారు…కానీ…