చిరంజీవి నన్ను త‌ప్పుకోమ‌న్నారు…కానీ…

మా ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత మంచు విష్ణు మీడియాతో ముచ్చ‌టించారు.  మా ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  మా ఎన్నిక‌ల నుంచి త‌న‌ను త‌ప్పుకోమ‌ని చిరంజీవి అన్నారని, ప్ర‌కాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు క‌దా, విష్ణుని పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని చెప్పొచ్చు క‌దా అని మోహ‌న్ బాబుకు చిరంజీవి చెప్పార‌ని మంచు విష్ణు పేర్కొన్నారు.  కానీ, ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిందే అని నాన్న‌, నేను అనుకోవ‌డం వ‌ల్ల పోటీలో నిల్చున్నాన‌ని మంచువిష్ణు తెలిపారు.  రామ్ చ‌ర‌ణ్ తన‌కు మంచి మిత్రుడు అని, కాని చ‌ర‌ణ్ త‌న‌కు ఓటు వేయ‌లేదు అనే విష‌యం త‌న‌కు తెలుసున‌ని, ఎందుకంటే, చ‌ర‌ణ్ వాళ్ల నాన్న చిరంజీవి మాట జ‌వ‌దాట‌డు అని, చిరంజీవి తీసుకున్న స్టాండే చ‌ర‌ణ్ కూడా తీసుకుంటాడ‌ని, అలానే, మానాన్న తీసుకున్న స్టాండ్‌కు తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని మంచు విష్ణు తెలిపారు.  

Read: మా అధ్య‌క్షుడిగా వారి రాజీనామాను అంగీక‌రించ‌ను…

-Advertisement-చిరంజీవి నన్ను త‌ప్పుకోమ‌న్నారు...కానీ...

Related Articles

Latest Articles