Site icon NTV Telugu

రైతుల పాలిట యముడిలా కేసీఆర్‌ తయారయ్యారు : వైఎస్ ష‌ర్మిల‌

రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్‌ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజ‌న్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం అక్క‌ప‌ల్లిలో పంట కొనుగోళ్ల‌లో జాప్యం,అప్పుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు మ‌ల్ల‌య్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ ష‌ర్మిల‌ పరామ‌ర్శించారు.

https://ntvtelugu.com/trs-is-unable-to-decide-on-the-replacement-of-district-presidents/

ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతుల‌కు వైఎస్ ఆర్‌ ఎంతో చేశారని… ప‌ద‌వుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసిన‌ట్టు? అని నిల‌దీశారు. రైతు బంధు ఇచ్చిన‌ట్టే ఇచ్చి, విత్తనాలు, స‌బ్సిడీలు, యంత్ర ల‌క్ష్మి, న‌ష్ట‌పరిహారం బంద్ పెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం టీఆర్ ఎస్ దని ఫైర్ అయ్యారు.

Exit mobile version