NTV Telugu Site icon

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై సీఎం జ‌గ‌న్ స్పంద‌న‌… బాధ్య‌త మ‌రింత పెరిగింది…

ఏపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ అఖండ‌మైన విజయం సాధించింది.  ఈ విజ‌యం అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు.  ఈ విజ‌యం త‌న బాధ్య‌త‌ను మ‌రింత పెరిగింద‌ని, గొప్ప విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  గ‌తంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల నుంచి ఇప్పుడు జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల వ‌ర‌కూ అన్ని ఎన్నిక‌ల్లోనూ వైసీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించార‌ని అన్నారు.  పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 81 శాతం, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 99 శాతం, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో 88 శాతం, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో 98 శాతం ఫ‌లితాలు సాధించామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.  ఎన్నిక‌ల స‌మ‌యంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చామ‌ని, కొన్ని ర‌కాల శ‌క్తులు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.  

Read: ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మారుస్తుందా?