Site icon NTV Telugu

ప్రముఖ యంగ్ యూట్యూబర్ గుండెపోటుతో మృతి

యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. ఆమె 27 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం అందరినీ కలిచివేస్తోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది. అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది.

Read Also: అఖండ సక్సెస్… బాలయ్యకు దిల్ రాజు పార్టీ

యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన కూడా ఉంది. కాగా శ్రియా మురళీధర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నటన అంటే ఎంతో ఇష్టపడే శ్రియ మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్.

Exit mobile version