కోతుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎప్పుడు వాటికి కోపం వస్తుందో చెప్పలేము. అందుకే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టేసి ఉన్న కోతికి కోపం అధికంగా ఉంటుంది. అలాంటి కోతి పక్కన నిలబడి ఫొటో దిగడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అవుతుంది. ఇలానే ఓ యువతి చెట్టుకు కట్టేసిన కోతి పక్కన నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నం చేసింది. అసలే కోపంగా ఉన్న ఆ కోతి ఒక్కసారిగా ఆ యువతి తలపైకి దూకింది. మెడను, తలను కొరికే ప్రయత్నం చేసింది. అయితే, తలకు స్కార్ఫ్ కట్టుకొని ఉండటంతో యువతికి పెద్దగా గాయాలు కాకుండా బయటపడింది. కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలకంటే ఫొటోలు ముఖ్యం కాదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కోపంగా ఉన్న కోతి పక్కన నిలబడి ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తే… ఇలానే జరుగుతుంది…!!
