మోడి వెళ్తే త‌ప్పులేన‌ప్పుడు… తానెందుకు వెళ్ల‌కూడ‌దు…

ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడి అమెరికా పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో జ‌రిగిన వివిధ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌ధాని పాల్గొన్నారు.  ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్ర‌యాణం అవుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, వ‌చ్చేనెల 6,7 తేదీల్లో ఇట‌లీలో ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది.  ఈ స‌ద‌స్సుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఆహ్వానం ల‌భించింది.  అయితే, ఆ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు కేంద్రం ఆమెకు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.  దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ మోడీపై విరుచుకుప‌డ్డారు.  ప్ర‌ధాని మోడి ఎక్క‌డికైనా వెళ్లేందుకు అనుమ‌తులు ఉన్న‌ప్పుడు త‌న‌కు ఎందుకు అనుమ‌తులు ఇవ్వ‌ర‌ని ఆమె మండిపడ్డారు.  ఎన్నిచోట్ల‌కు వెళ్ల‌కుండా త‌న‌ను అడ్డుకోగ‌లుగుతార‌ని మండిప‌డ్డారు.  శాశ్వ‌తంగా త‌న‌ను అడ్డుకోలేర‌ని అన్నారు.  అయితే, విదేశాంగ‌శాఖ దీనికి స‌మాధానం ఇచ్చింది. ఆ స‌ద‌స్సు ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి పాల్గొనే స్థితికి అనుగుణంగా లేద‌ని, అందుకే అనుమ‌తి నిరాక‌రించిన‌ట్టు విదేశాంగ‌శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది.  అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో ఇటలీలో ఈ స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది. 

Read: 8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో కేంద్ర హోంశాఖ మంత్రి భేటీ…

-Advertisement-మోడి వెళ్తే త‌ప్పులేన‌ప్పుడు... తానెందుకు వెళ్ల‌కూడ‌దు...

Related Articles

Latest Articles