Site icon NTV Telugu

జీవీఎంసీలో ఉప ఎన్నిక.. కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిప్‌ కార్పోరేషన్‌ పరిధిలో 31వ వార్డు కార్పొరేటర్‌ పదవికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యం అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే వానపల్లి రవికుమార్ సతీమణి గాయత్రిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం.

అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు పార్టీ కట్టుబడి ఉందన్న ఈ మేరకు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెల్లడించారు. పద్మశాలి సామాజిక వర్గం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

Exit mobile version