Site icon NTV Telugu

ఒమిక్రాన్ వ్యాప్తిపై ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా దేశ‌మంత‌టా వ్యాపిస్తోంది.  ఇప్ప‌టికే ఢిల్లీలో 57 కేసులు న‌మోద‌య్యాయి.  ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీలో క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధించింది.  బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని ఢిల్లీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.  ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ దేశంలోనూ మెల్లిగా వ్యాపిస్తున్న‌ది.  

Read: గుడ్ న్యూస్‌: ఎల‌క్ట్రిక్ వాహ‌నం కొనుగోలు చేస్తే… ప‌న్ను మిన‌హాయింపు…

బ్రిట‌న్‌లో కేసులు న‌మోదైన రీతిగా ఇండియాలో న‌మైదైతే రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  పండుగ‌ల సీజ‌న్‌, న్యూఇయ‌ర్ వేడుక‌లు ఉండ‌టంతో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను కోరింది.  అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూను కూడా విధించాల‌ని కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖలు రాసింది.  ఢిల్లీ బాట‌లో మ‌రికొన్ని రాష్ట్రాలు కూడా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  

Exit mobile version