Site icon NTV Telugu

5 నిమిషాల్లో 2 వేల కోట్ల విలువైన‌ సెల్‌పోన్లు అమ్మకం…

ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం షావోమీ 12 సీరిస్‌ను డిసెంబ‌ర్ 28 వ తేదీన రిలీజ్ చేసింది.  ఈ ఫోన్ ను రిలీజ్ చేసిన 5 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 1.8 బిలియ‌న్ యునాన్ల స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు జ‌రిగాయి.  అంటే ఇండియన్ క‌రెన్సీ ప్ర‌కారం రూ. 2108 కోట్లు విలువైన షావోమీ 12 సీరిస్ మొబైల్ అమ్మ‌కాలు జ‌రిగాయి.  ఈ స్థాయిలో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డానికి కార‌ణాలు అనేకం ఉన్నాయి.  షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేసింది.  షావోమీ 12, షావోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్లు త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి తీసుకురావ‌డంతో భారీగా అమ్మ‌కాలు జ‌రిగాయి.  

Read: “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్

త‌క్కువ ధ‌ర‌, అడ్వాన్స్డ్ ఫీచ‌ర్లతో పాటు న్యూఇయ‌ర్ కూడా క‌లిసిరావ‌డంతో సేల్స్ భారీ స్థాయిలో జ‌రిగాయి.  12జీబీ ర్యామ్‌ 256 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సౌకర్యంతో బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా క‌లిగియుంది.   6.28 అంగుళాలు, 2కే అమోలెడ్‌ డిస్‌ప్లే, 4,500ఏఎంహెచ్‌ బ్యాటరీ,120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 సీపీయూ ను క‌లిగిఉంది.

Exit mobile version