మామూలుగా చిన్న చిన్న పడవలు గాలి వాటుగా ప్రయాణం చేస్తుంటాయి. వాటికి అమర్చిన తెరచాపల కారణంగా అవి ప్రయాణం చేస్తుంటాయి. అలా కాకుండా పెద్ద పెద్ద నౌకలు ప్రయాణం చేయాలి అంటే చోదకశక్తి అవసరం. దానికోసం డీజిల్, పెట్రోల్ వంటివి వినియోగిస్తుంటారు. పెద్ద పరిమాణంలో ఉండే ఓడలకు చమురు అవసరం లేకుండా పవన శక్తితోనే నడపవచ్చని అంటున్నారు కేఫ్ విలియమ్ యాజమాన్యం.
Read: ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే… వెయ్యి కిమీ ప్రయాణం చేయవచ్చు…
కేఫ్ విలియమ్ తన కాఫీ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సెయిల్ కార్గో షిప్ తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. కేఫ్ విలియమ్ చెప్పిన విధంగా ఓడను తయారు చేసింది సెయిల్ కార్గో. ఇది పూర్తిగా పవన శక్తిని ఇంధన శక్తిగా మార్చుకొని ప్రయాణం చేస్తుందని సెయిల్ కార్గో తెలియజేసింది. ఈ షిప్ 2023లో సముద్రయానం చేయబోతున్నది.