Site icon NTV Telugu

అత‌నో రియ‌ల్ మోగ్లీ… ఏళ్ల త‌ర‌బ‌డి అడివిలో గ‌డిపి… ఇప్పుడు…

మోగ్లీ క‌థ‌లు అద్భుతంగా ఉంటాయి. చిన్న‌పిల్ల‌లు అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక మోగ్లీ క‌థ‌ల‌తో వ‌చ్చిన జంగిల్ బుక్ సినిమాలు ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అ చిన్నిపిల్ల‌వాడు అడ‌విలో జంతువుల మ‌ధ్య పెరిగి వాటితో పాటుగా క‌లిసి జీవించే విధానాన్ని మోగ్లీ సినిమాల్లో చూపిస్తుంటారు. నిజ జీవితంలో అడ‌విలో జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తే చాలా భ‌యంక‌రంగా ఉంటుంది క‌దా. రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీ అనే యువ‌కుడి ఆకారం చిన్న‌ప్ప‌టి నుంచి అంద‌రికంటే భిన్నంగా ఉండేది. చిన్న త‌ల‌తో విచిత్రంగా ఉండేవాడు. దీంతో తోటి పిల్ల‌లు గేలి చేయ‌డంతో భ‌రించ‌లేక అడ‌విలోకి వెళ్లిపోయాడు. కొంత‌కాలం అడ‌విలోనే జీవించిన ఎల్లీని ఆఫ్రీమాక్స్ అనే యూట్యూబ్ ఛాన‌ల్ రియ‌ల్ రియ‌ల్ లైఫ్ మోగ్లీ పేరుతో డాక్యుమెంట‌రీని చేసింది. ఈ డాక్యుమెంట‌రీ ప్ర‌సారం తరువాత గోఫండ్ మీ పేరుతో ఓ పేజీని ఓపేన్ చేసి విరాళాలు సేక‌రించింది. ఆ విరాళాలతో ప్ర‌స్తుతం జాంజిమ‌న్ ఎల్లీ స్కూల్‌కు వెళ్తున్నాడు. విరాళాల‌తో ఎల్లీ, అత‌ని త‌ల్లి బాగుంటే చాలు అనుకున్నారు. కానీ, స్కూల్ చ‌దువుల‌కు కావాల్సిన విరాళాలు రావ‌డంతో ఎల్లీ స్కూల్‌కు వెళ్లి చ‌దువుకుంటున్నాడు.

Read: విమానంలో కిటికీలు అండాకారంలో ఎందుకు ఉంటాయో తెలుసా?

Exit mobile version