మరో లేమన్ బ్రదర్స్‌గా మారుతున్న చైనా ఎవర్ గ్రాండే… సంక్షోభం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అతిపెద్ద దివాలా తీసిన కంపెనీ ఏది అంటే అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ అని చెప్తాం. ఈ కంపెనీ 2008 లో 600 బిలియన్ డాలర్ల దివాళా తీసింది. అప్పట్లో ఈ కంపెనీ దివాళా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అలాంటి సంక్షోభం ఇప్పుడు చైనా నుంచి రాబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. చైనా జీడీపీలో 29శాతం రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎవర్ గ్రాండే. ఈ కంపెనీ ఇప్పుడు దివాళా తీయబోతున్నది. ఎవర్ గ్రాండే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్లమేర చెల్లింపులు చెల్లించాల్సి ఉన్నది. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ఇలాంటి బడా కంపెనీ ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది అంటే అర్థం చేసుకొవచ్చు. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ 23 వ తేదీకి 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉన్నది. అయితే, ఈ వడ్డీని ఇప్పట్లో చెల్లించలేమని కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చైనాలో కుదేలయింది. దీంతో కొట్లాది ప్రాపర్టీలు ఖాళీగా ఉన్నాయి. కొనేవాళ్లు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ కంపెనీలను ఆదుకోకుంటే ఆ సంక్షోభం ప్రభావం ప్రపంచదేశాలపై పడే అవకాశం ఉంటుంది.
Read: ఆ దేశాధ్యక్ష పదవి పోటీలో స్టార్ బాక్సర్…
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..