NTV Telugu Site icon

ఆ చిన్న‌మాట‌… అడ‌వి చుట్టూ తిరిగేలా చేసింది…

చిన్న‌ప్పుడు చెప్పిన మాటలు పెద్ద‌య్యాక ప్ర‌భావితం చేస్తుంటాయి. ఎంత పెద్ద చ‌దువులు చ‌దివినా, ఉద్యోగాలు చేసినా, ఆ మాట‌ల ప్ర‌భావం మ‌నిషిపై త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఆ వైపే మ‌నిషిని న‌డిపిస్తుంది అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచే భూపాల్‌కు చెందిన సుయాస్ కేస‌రీ అనే వ్య‌క్తికి వైల్డ్‌లైఫ్ జంతువులంటే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉండేది. చిన్న‌త‌నంలో సుయాస్ అమ్మ‌మ్మ‌తో క‌లిసి జూకి వెళ్లాడు. ఎన్‌క్లోజ‌ర్‌లో ఉన్న జంతువుల‌ను చూసి కేరింత‌లు కొట్టారు. నువ్వు ఆనందంగా ఉన్నావు..కానీ, అవి ఆనందంగా లేవ‌ని చెప్పింది. అవి అడ‌విలో ఉంటేనే ఆనందంగా ఉంటాయని చెప్పింది వాళ్ల అమ్మ‌మ్మ‌. అప్ప‌టి నుంచి జంతువుల గురించి ఆలోచించ‌డం మొద‌లుపెట్టాడు. మంచి చ‌దువు చ‌దివి ఉద్యోగం తెచ్చుకున్న‌ప్ప‌టికి ఆలోచ‌న మొత్తం అడ‌వి గురించి అడ‌విలోని జంతువుల గురించే ఉండేది. 20 సంవ‌త్స‌రాల దృష్టికోణంలో అడవి అనే డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌ను చిత్రీక‌రించారు. దీనికి వ‌ర‌ల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ నేచ‌ర్ నిథులు స‌మ‌కూర్చింది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పంట‌ల‌ను నాశ‌నం చేస్తున్న 20 ఏనుగుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు గ్రామ‌స్తులు సిద్ధ‌మ‌వుతుండ‌గా వారితో మాట్లాడి ఏనుగులు పంట‌పొలాల్లోకి రాకుండా కంచెను ఏర్పాటు చేశాడు. వైల్డ్‌లైఫ్ జంతువుల‌ను కాపాడి అవి మ‌నుగ‌డ సాగించేలా చేయాల‌న్న‌ది స‌యాస్ క‌ల‌. ఆ క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి ఓ ఓటీటీ ఛాన‌ల్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు స‌యాస్ కేస‌రీ. మ‌రి స‌యాస్ కేస‌రీ క‌ల నిజం అవుతుందా చూడాలి.

Read: వైర‌ల్‌: పెళ్లి వేడుక‌ల్లో అనుకోని అతిథి… జనాల ప‌రుగులు…