Site icon NTV Telugu

ఒమిక్రాన్ అంటే ప్ర‌పంచ దేశాలు ఎందుకు హ‌డ‌లిపోతున్నాయి?

ఒమిక్రాన్ ఈ పేరు వింటే ప్ర‌పంచ దేశాలు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 26 కోట్ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా 52 ల‌క్ష‌ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  గ‌త రెండేళ్లుగా క‌రోనా భ‌యంగుప్పిట్లో ప్ర‌పంచం కాలం గ‌డుపుతోంది.  ఇప్పుడు కొత్త రూపంలో మ‌ళ్లీ విజృంభించేందుకు సిద్దం అవుతున్న‌ది.  ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవ‌లే సౌత్ ఆఫ్రికాలో బ‌య‌ట‌ప‌డింది.  ఈ వేరియంట్‌లో 32 మ్యూటేష‌న్లు ఉన్నాయి.  ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.  

Read: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ‌ర్షాలు… 200 ఏళ్లలో ఇలా జ‌ర‌గ‌డం నాలుగోసారి…

ఈ వేరియంట్  ఇప్పుడిప్పుడే ప్ర‌పంచంలోని అనేక దేశాల‌కు విస్త‌రిస్తోంది.  ముఖ్యంగా యూర‌ప్ దేశాల్లో ఈ వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది.  అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ కావ‌డం, వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  ఎటునుంచి వ‌చ్చి క‌రోనా కాటు వేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.  బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌తో పాటు కొన్ని యూర‌ప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి.  అంద‌రికంటే ముందుగా ఇజ్రాయిల్ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది.  విదేశీ ప్ర‌యాణ‌ల‌పై నిషేదం విధించింది. 

Exit mobile version