NTV Telugu Site icon

పెట్రోల్ బంకుల వ‌ద్ధ ఇలా చేస్తున్నారా… జ‌రాభ‌ద్రం…

పెట్రోల్ బంకుల వ‌ద్ధ సెల్‌ఫోన్ మాట్లాడితే వెంట‌నే అక్క‌డి సిబ్బంది వారిస్తుంటారు. పెట్రోల్ బంకుల వ‌ద్ద ఫోన్ మాట్లాడితే వాహానాలు ఫైర్ అవుతుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు అనేకం జ‌రిగాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పెట్రోల్ బంకుల వ‌ద్ధ‌కు రాగానే ఫోన్ మాట్లాడేవారు కూడా దానిని ప‌క్క‌న పెడ‌తారు. పెట్రోల్ బంకుల వ‌ద్ద ఎందుకు ఫోన్ మాట్లాడ‌కూడ‌దు… ఎందుకు వాహనాలు ఫైర్ అవుతాయో ఇప్పుడు తెలుకుందాం. సెల్ ఫోన్ మాట్లాడే స‌మ‌యంలో మొబైల్ ఫోన్‌కు, సిగ్న‌ల్ ట‌వ‌ర్‌కు మ‌ధ్య క‌నెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. ఆ స‌మయంలో సెల్ ఫోన్ నుంచి ఎల‌క్ట్రోమాగ్న‌టిక్ రేడియోష‌న్ వెలువ‌డుతుంది. ఈ రేడియోష‌న్‌కు చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ రేడియోష‌న్ కు పెట్రోల్ ఆవిరి త‌గిలితే స్పార్క్ ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా మంట‌లు చెల‌రేగుతాయి. క్ష‌ణాల్లోనే పెట్రోల్ బంకులు కాలి బూడిద‌వుతాయి. అందుకే పెట్రోల్ బంకుల వ‌ద్ధ సెల్ ఫోన్ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెబుతుంటారు.

Read: 30 ఏళ్లుగా అక్క‌డ టాయిలెట్ల కోసం ఆ వాట‌ర్ ను ఉప‌యోగిస్తున్నార‌ట‌…