Site icon NTV Telugu

కేసులు పెరుగుతున్నాయి … జాగ్ర‌త్త‌గా ఉండాలి…

ప్ర‌పంచంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌పంచ‌దేశాలు ఆందోళ‌న చెందుతున్న సంగ‌తి తెలిసిందే.  సౌతాఫ్రికాలో మొద‌లైన ఈ కేసులు క్ర‌మంగా ప్ర‌పంచ‌దేశాల‌కు విస్త‌రిస్తోంది. యూర‌ప్ దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరిగితే మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించింది.  ఆసుప‌త్రుల్లో చేరే రోగుల సంఖ్య‌ను అందించాల‌ని పేర్కొన్న‌ది.  

Read: దారుణం: పేలిన పెట్రోల్ ట్యాంక‌ర్‌… 50 మంది మృతి…

బ్రిట‌న్‌లో వ‌చ్చే ఏప్రిల్ నాటికి 25 నుంచి 75 వేల వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించింది అంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉండ‌బోతుందో అర్థం చేసుకోవ‌చ్చు.  వీలైనంత వ‌ర‌కు కేసులు పెర‌గ‌కుండా ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేదంటే చేయిదాటిపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది.  ఇక ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి.  తాజాగా దేశంలో బ‌య‌ట‌ప‌డ్డ కేసుల‌తో క‌లిపి మొత్తం ఈ కేసుల సంఖ్య 61కి చేరింది.

Exit mobile version