NTV Telugu Site icon

ఆరేళ్ల క్రితం మృత్యువును జ‌యించి… ఇప్పుడు ఇలా…

చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందారు.  సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్టింగ్ట‌న్‌లో జ‌రిగే ఆర్మీ అధికారిక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్‌తో పాటుగా ఆయ‌న భార్య మ‌ధులిక‌, మ‌రో 11 మంది సైనికులు మృతి చెందారు.  అయితే, ఆరేళ్ల క్రితం బిపిన్ రావ‌త్ లెప్టినెంట్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న స‌మ‌యంలో నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లా నుంచి చీతా హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరిన సెక‌న్ల వ్య‌వ‌ధిలో సాంకేతిక లోపంతో కూలిపోయింది.

Read: హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌ముఖులు…

ఈ ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ పూర్తిగా ధ్వంసం అయింది.  అయితే, బిపిన్ రావ‌త్‌, మ‌రో ఇద్ద‌రు సైనికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.  ఆరేళ్ల క్రితం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.  అప్పుడు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బిపిన్ రావ‌త్ ఇప్పుడు ఇలా ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో యావ‌త్ భార‌తీయులు విచారాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్ర‌తి ఒక్క‌రూ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.