Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. పీఆర్సీపై ఏపీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపనుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
  2. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణే అజెండాగా జీఎస్టీ మండలి సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ భేటీ కానున్నారు. అయితే చేనేతపై 12 శాతానికి పన్ను పెంచాలనే నిర్ణయం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
  3. భారత్‌-సౌతాఫ్రికా తొలి టెస్ట్‌ సెంచూరియన్‌లో జరుగుతోంది. అయితే నేడు ఐదో రోజు మ్యాచ్‌ జరుగనుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్‌ 94/4 గా ఉంది. దక్షిణాఫ్రికా లక్ష్యం 305 పరుగులు ఉండగా ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌ స్కోర్‌ 327&174 లు ఉండగా, విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్‌ ఉంది.
  4. నేడు హైదరాబాద్‌లోని పబ్‌లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇటీవల ఇళ్ల మధ్యలో పబ్‌లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, పబ్‌ల నుంచి వచ్చే డీజే సౌండ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారి పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.
  5. నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
  6. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.
  7. నేడు మేడారంలో ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు పరిశీలించనున్నారు.
  8. నేటి నుంచి జనవరి 2 వరకు కేరళలో నైట్‌ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్‌ కర్ఫ్యూ ఉండనుంది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేసింది.
  9. నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు.

Exit mobile version