Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం కానుంది. వర్చువల్‌గా సీఎం జగన్‌ జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు.
  2. నేడు తెలంగాణలో రెండో రోజు రైతుబంధు సాయం అందజేయనున్నారు. యాసంగి పంటకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది.
  3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480లు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.
  4. సెంచూరియన్‌ టెస్టు నేడు నాలుగో రోజు భారత్‌-సౌతాఫ్రికా మధ్య తొలిటెస్ట్ జరుగనుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 16/1గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 197 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా స్కోర్‌ 327 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 146 పరుగుల ఆధిక్యంలో భారత్‌ ఉంది.
  5. విజయవాడలో నేటితో భవానీ దీక్షల విరమణ ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షలు ముగింపు జరుగుతాయని ఆలయ అధికార వర్గాలు వెల్లడించాయి.
Exit mobile version